Tributes | పేదల ఆరాధ్య దైవం సాయన్న

Tributes | పేదల ఆరాధ్య దైవం సాయన్న

  • మక్తల్‌లో ఘనంగా వర్ధంతి వేడుకలు

Tributes | మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాబిన్ హుడ్, పేద ప్రజల ఆరాధ్య దైవం పండుగ సాయన్న అని.. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం కృషిచేసిన మహనీయుడు అని మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కోళ్ళ వెంకటేష్ కొనియాడారు. పండుగ సాయన్న వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని మత్స్య పారిశ్రామిక భవనంలో సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూస్వాములు పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజలకు సంపాదన పంచిపెట్టి, బహుజన గుండెల్లో ఆరాధ్య దైవంగా పండుగ సాయన్న నిలిచారని కొనియాడారు. నేటికీ పల్లెల్లో పండుగ సాయన్న పేరిట పాటలను ప్రజలు పాడుకుంటూ… వాటి రూపంలో ఆయన సజీవంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో కట్టా వెంకటేష్, గుంతల శివకుమార్, చీరాల నరసింహమూర్తి, కున్షి నాగేందర్, కావలి రాజేందర్, వాకిటి హన్మంతు, కావలి బుజ్జప్ప, సాయిలు బుజ్జప్ప, మామిళ్ల పృథ్వీరాజ్, కల్లూరి గోవర్దన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply