Tributes | సావిత్రి బాయి పూలే జయంతి

Tributes | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ షఫీ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాల యజమాని డాక్టర్ షఫీ మాట్లాడుతూ… స్త్రీల పట్ల, స్త్రీ విద్య పట్ల వివక్ష ఉన్న ఆనాటి రోజుల్లోనే ఎంతో మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగిందన్నారు.
పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించి స్త్రీల విద్యాభివృద్ధికి కృషిచేసిన తొలితరం ఉద్యమకారిణిగా సావిత్రి బాయి పూలే అరుదైన రికార్డు సృష్టించారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఆమె అడుగుజాడల్లో నడవవలసిన అవసరం ఉందని ఉద్బోధించారు. సావిత్రి బాయి జన్మదినమైన ఈరోజును తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సన, ప్రిన్సిపాల్ రాధాకృష్ణన్ నాయర్, ప్రైమరీ ఇన్చార్జి బిను, వైస్ ప్రిన్సిపాల్, ఏవో అండ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
