ప్రత్తిపాటి శ్రీధర్ కు సత్కారం…

భవానిపురం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నంబర్ 1 స్థానంలో నిలవడంతో మైనార్టీ నాయకులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.. స్తానిక 56 వ డివిజన్ కు చెందిన బిజెపి మైనార్టీ నాయకుడు కరీముల్లా గురువారం కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో పాటు కూటమి నాయకుల ను అభినందించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, చద్దర్ తో సన్మానించారు.. కార్యాలయ సిబ్బందికి, సుజనా మిత్ర లకు డ్రై ఫ్రూట్స్ అంద చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గుర్రం కొండ, కూటమి నాయకులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు..
