పంచాయతీ కార్మికులకు సన్మానం

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బాబా పూర్ పంచాయతీలో ఉత్తమ సేవలందిస్తున్న కార్మికులకు ఆదివారం ఆ పంచాయతీ సర్పంచ్ మెస్రం గంగాదేవి ప్రభాకర్ శాలువాల తో సన్మానం చేశారు. కార్మికులు చేస్తున్న పారిశుద్ధ్య పనులు ప్రశంసనీయమని అన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే కార్మికుల కృషి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చంద్రకళ జంగు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
