Tribal | ఆదివాసీల‌కు అంద‌ని ద్రాక్ష‌యే!

Tribal | ఆదివాసీల‌కు అంద‌ని ద్రాక్ష‌యే!

  • ద‌శాబ్దాలుగా గుడిసెల్లోనే ఆవాసం
  • పాల‌కులు మారినా మంజురు కానీ శాశ్వ‌త గృహాలు

Tribal | బెల్లంపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : ఆదివాసీల‌కు ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం అంద‌ని ద్రాక్ష అవుతుంది. పాల‌కులు మారినా వారికి శాశ్వ‌త గృహాలు(Permanent homes) మంజూరు కావం లేదు. ఫ‌లితంగా ద‌శాబ్ధాలుగా వారు గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారు. గాలి వీచినా.. వ‌ర్షం కురిసినా బితుకుబితుకు మంటూ కాలం గ‌డుపుతున్నారు. మంచిర్యాల జిల్లాలో సుమారు ఏడు వంద‌ల‌ కుటుంబాలకు చెందిన మూడు వేలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు.

బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, నస్పూర్ భీమిని, కన్నెపల్లి హాజీపూర్, జన్నారం జైపూర్, దండేపల్లి, కన్నెపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఎరుకల సామాజిక వ‌ర్గం తడకలు బుట్టలు అల్లుకుంటూ నేటికీ పూరి గుడిసెలోనే కాలం వెళ్లదీస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనూ, ఈ ప్ర‌భుత్వం హ‌యాంలోనూ ఒక్క ఇళ్లు కూడా త‌మ‌కు మంజూరు కాలేద‌ని ఎరుక‌ల సామాజికవ‌ర్గ ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Tribal | వీరు అర్హులు కాదా?…

Tribal |

ఎమ్మెల్యే నుంచి మంత్రుల వ‌ర‌కూ అర్హులంద‌రికీ ప‌థ‌కాలు వ‌ర్తింప‌జేస్తామ‌ని చెబుతుంటారు. అయితే పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న వీరు అర్హులు కాదా? అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. కడు పేదరికంలో జీవిస్తూ గ్రామ వెలుపల ఉండే ఈ ఆదివాసీ(tribal) ఎరుకల సామాజిక‌వ‌ర్గం జీవన విధానంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులపై ఉంది.

Tribal |
Tribal |

అయినా ఇటు ప్ర‌జాప్ర‌తినిధులు, అటు అధికారులు ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అర్హుల‌కు ఇళ్లు మంజూరు కావ‌డం లేద‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి అర్హులైన త‌మ‌కు ఇళ్లు మంజూరు చేయాల‌ని ఎరుక‌ల సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Tribal | ఇళ్ల కోసం పోరాటం చేస్తాం…

ఇందిర‌మ్మ ఇళ్ల కోసం పోరాటం చేస్తామ‌ని ఆదివాసీ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్యాల బాపు అన్నారు. త‌మ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లు ఎక్కువ మంది పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నారు. ఒక్క రికీ కూడా ఇందిర‌మ్మ ఇళ్లు(Indiramma houses) మంజూరు కాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2005 కాలంలో వై ఎస్ ఆర్ ప్రభుత్వం కొందరికే ఇండ్లు ఇచ్చింద‌న్నారు. ఒక వేళ ఇళ్లు మంజూరు కోసం కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధిస్తాంమ‌ని హెచ్చ‌రించారు.

CLICK HERE TO READ MORE : Minister | ఐఏఎస్ ల పై ఆరోపణలు సిగ్గుచేటు

CLICK HERE TO READ MORE :

Leave a Reply