TRAVELS BUS | కేశినేని ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో..

TRAVELS BUS | కేశినేని ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో..

  • జిల్లా యువతకు నైపుణ్య శిక్షణ..
  • స్వయం ఉపాధి పెంచేందుకు చర్యలు..
  • ఎస్.హెచ్.జి స‌భ్యుల‌కు హోం బేస్ట్ ప్రోడ‌క్ట్స్..
  • హ్యాండ్ మేడ్ పేప‌ర్ ఉత్ప‌త్తుల‌పై శిక్ష‌ణ..
  • డిసెంబ‌ర్ 8 నుంచి 12 వ‌ర‌కు..
  • ఐదు రోజులు పాటు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం…
  • ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ కి బ‌యలుదేరిన బ‌స్సు…

TRAVELS BUS | విజ‌య‌వాడ, ఆంధ్రప్రభ : ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ ఎంపీ కేశినేని (Kesineni) శివనాథ్ కృషి చేస్తున్నారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) త‌న కేశినేని ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి) సహకారంతో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిధిలోని రూరల్ నియోజకవర్గాలు నందిగామ, మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేటకి చెందిన 16 మండలాల్లోని స్వయం సహాయక సంఘాల స‌భ్యుల‌కు నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఇప్పించి, వారి జీవ‌నో పాధి పెంచేందుకు ప్ర‌ణాళిక సిద్దం చేశారు. ఎస్.హెచ్.జి గ్రూపుల స‌భ్యుల‌కు విడ‌త‌ల వారీగా హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. సంస్థలో ఐదు రోజుల పాటు శిక్ష‌ణ ఇప్పించ‌టం జ‌రుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా రూర‌ల్ నియోజ‌క‌వర్గాల‌కు చెందిన 16 మండ‌లాల ఎస్.హెచ్.జి సంఘాల్లోని 61 మంది మ‌హిళ‌ల‌ను హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. సంస్థలో డిసెంబ‌ర్ 8వ తేదీ నుంచి 12 వ తేదీ వ‌ర‌కు జ‌రిగే రెండో విడ‌త శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కేశినేని ఫౌండేష‌న్ ఏర్పాటు చేసిన బ‌స్సులో విజ‌య‌వాడ గొల్ల‌పూడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం నుంచి 10 మంది, జి.కొండూరు మండ‌లం నుంచి 10 మంది, విజ‌య‌వాడ (Vijayawada) రూర‌ల్ నుంచి 20 మంది, నందిగామ నియోజ‌క‌వ‌ర్గం కంచిక‌చ‌ర్ల నుంచి 5 గురు, జ‌గ్గ‌య్య‌పేట నుంచి 16 మంది హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. సంస్థ లో ఐదు రోజ‌ల పాటు శిక్ష‌ణ పొందేందుకు వెళ్లారు.
హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. సంస్థలో వీరికి హ్యాండ్‌మేడ్ పేపర్ త‌యారీ విధానం పై (30 మందికి) ఆ పేప‌ర్ నుంచి త‌యారయ్యే విలువ ఆధారిత ఉత్పత్తులు, హోమ్ బేస్డ్ ప్రోడ‌క్ట్స్ (వాషింగ్ పౌడ‌ర్, లిక్విడ్ సోప్స్, షాంపులు, ఫినాయ‌ల్ ) తయారి పై (31 మందికి ) శిక్ష‌ణ కార్య‌క్ర‌మం అందిస్తారు. హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. సంస్థలో డిసెంబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 5 వ‌ర‌కు జ‌రిగిన మొద‌టి విడ‌త శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఫుడ్ ప్రోసెసింగ్ (మిల్లెట్స్ ఉత్ప‌త్తులు, బేక‌రీ ప్రోడ‌క్ట్స్, ఐస్ క్రీమ్) త‌యారీ పై శిక్ష‌ణ అందించారు.

TRAVELS BUS

ఎంపీ కేశినేని శివ‌నాథ్ కేశినేని ఫౌండేష‌న్ మొద‌టి విడ‌త‌లో ఇక్క‌డ నుంచి 40 మంది మ‌హిళ‌లు పంపించారని, వారంతా శిక్ష‌ణ పూర్తి చేసుకుని డిసెంబ‌ర్ 6వ తేదీ తిరిగి రావ‌టం జ‌రిగింద‌ని ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహా చౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ తెలిపారు. వీరిలో 20 మంది ఐదు రోజ‌ల శిక్ష‌ణ తీసుకోగా, మ‌రో 20 మంది గ‌చ్చిబౌలిలోని ఎఫ్.డి.డి.ఐ లో లెదర్, నాన్ లెదర్, గార్మెంట్స్ కి సంబంధించి వస్తువుల తయారీ పై నెల‌ రోజుల పాటు శిక్షణ కార్య‌క్ర‌మం పొందుతున్న‌ట్లు తెలియ‌జేశారు. హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. సంస్థలో రెండో విడ‌తగా శిక్ష‌ణ పొందేందుకు స్వయం సహాయక సంఘాల సభ్యుల జాబితాను త‌యారు చేసి ఎన్.ఐ.ఆర్.డి కి పంపించిన పిడి డిఆర్డిఏ అధికారి నాంచారయ్యకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే త‌మ జీవ‌నోపాధి మెరుగుపర్చేందుకు త‌న సొంత నిధుల‌తో కేశినేని ఫౌండేష‌న్ ద్వారా శిక్ష‌ణ ఇప్పించేందుకు పంపిస్తున్న ఎంపీ (MP) కేశినేని శివ‌నాథ్ కు ఎస్.జి.హెచ్ మ‌హిళ‌లు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

Leave a Reply