హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర పరిపాలనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం పలు కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలను అమలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా బదిలీల వివరాలు ఇలా…
- సబ్యసాచి ఘోష్ (1994 బ్యాచ్): ‘ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ స్కీమ్స్ యూనిట్’ అమలు కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదనంగా, ఆయన సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) కొనసాగిస్తారు.
- అనితా రామచంద్రన్ (2004 బ్యాచ్): మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా కొనసాగుతూనే, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.
- ఇలంబరితి కె (2005 బ్యాచ్): మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏ & యుడి) శాఖ కార్యదర్శి పదవి నుండి ప్రభుత్వ కార్యదర్శి పదవికి బదిలీ అయ్యారు.
- బి. శ్రీధర్ (2004 బ్యాచ్): బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి పదవి నుండి జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ (జిఎ విభాగం) కార్యదర్శిగా నియమితులయ్యారు.
- డా.యష్మీన్ బాషా (2015 బ్యాచ్): హార్టికల్చర్ డైరెక్టర్‌గా కొనసాగుతూనే, ఆమె టిజి ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను చేపట్టారు.
- ఎంఏ & యుడి శాఖ కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతోనే కొనసాగుతాయి.

