KNL | సెకండరీ గ్రేడ్ టీచర్లకు బదిలీలు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి

కర్నూలు బ్యూరో, జూన్ 7, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా విద్యా శాఖ అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్లకు బదిలీలను మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయం వెలువడడంతో శనివారం కర్నూలు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక కర్నూలు జిల్లా కన్వీనర్ సేవా లాల్ నాయక్ మాట్లాడుతూ… ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8 సంవత్సరాల కాలం పూర్తయి కంపల్సరీ బదిలీ కావలసిన 1500మందికి పైగా టీచర్లు, మొత్తం 3500ల‌కు పైగా ఖాళీలను ప్రాధాన్యత పరంగా వెబ్ సైట్ లో పొందుపరచాలన్నారు.ఈ ప్రాధాన్యత క్రమంలో పొరపాటు జరిగితే ఆ టీచర్ నష్టపోతారని చెప్పారు. పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు కృష్ణా రెడ్డి సెకండరీ గ్రేడ్ టీచరులు అందరికీ జిల్లాపై పూర్తి అవగాహన ఉండటం సాధ్యం కాదన్నారు. కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ మంచిదన్నారు. యు టీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ వెబ్ కౌన్సిలింగ్ అనేది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు పూర్తిగా నష్టదాయకమ‌ని పేర్కొన్నారు.

కావున ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివారం ఉదయం 9 గంటలకు కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయంను ముట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర నాయకులు ఆప్టా కాకి ప్రకాష్ రావు, అపస్ సత్యనారాయణ ప్రకటించారు. కావున కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ముట్టడికి నంద్యాల, కర్నూలు జిల్లాల‌ నుండి మహిళా ఉపాధ్యాయులు తరలిరావాలని, అధిక సంఖ్యలో హాజరై వెబ్ కౌన్సిలింగ్ విధానంపై వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయంను ముట్టడి చేస్తామ‌ని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఆర్ టి యు నాయకులు కృష్ణారెడ్డి, ధనుంజయ, రామపక్కి రెడ్డి, చాంద్ బాషా, రవి ప్రకాష్, రామక్రిష్ణ యు టి ఎఫ్ నాయకులు రవి కుమార్, నవీన్ పాటిల్, హేమంత్ కుమార్ సురేష్ కుమార్, ఎస్ టి యు నుండి గోకారి, జనార్ధన్, మౌలాలి, అజమ్ భాషా అపస్ నుండి నాగిరెడ్డి, నాగస్వామి ఆప్టా నుండి మధుసూదన్ రెడ్డి, సేవాలాల్ నాయక్, రాజసాగర్, రఫీ ఎస్ జి టి ఎఫ్ నుండి లక్ష్మయ్య, రాజ శేఖర్ వై ఎస్ ఆర్ టి ఎ నుండి ప్రతాప్ రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply