Tragic incident | ముగ్గురు పిల్లలను చంపి..

Tragic incident | ముగ్గురు పిల్లలను చంపి..
తండ్రి ఆత్మహత్య
Tragic incident | నంద్యాల, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా (Nandyal District) లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో ఓ తండ్రి తన ముగ్గురు చిన్న పిల్లలకు విషం కలిపిన పాలు తాగించి చంపి, అనంతరం స్వయంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
మృతులను వేములపాటి సురేంద్ర (Surendra) (35), ఆయన పిల్లలు కావ్యశ్రీ (Kavyashree) (7), ధ్యానేశ్వరి (Dhyaneshwari) (4), సూర్య గగన్ (Surya Gagan) (2)గా పోలీసులు గుర్తించారు. సురేంద్ర భార్య మహేశ్వరి (32) గతేడాది ఆగస్టు 16న అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మరణానంతరం సురేంద్ర మానసికంగా కుంగిపోయినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు (police) ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక కుంగదీత కారణంగా ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
