కర్నూలు బ్యూరో, , ఆంధ్రప్రభ: మంత్రాలయంలోని (mantralayam,) తుంగభద్ర నదిలో (tungabhadra river ) ముగ్గురు యువకుల మృతదేహాలు ( dead bodies) లభ్యమయ్యాయి.
కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాకు చెందిన ప్రమోద్, అజిత్, సచిన్ శనివారం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శన నిమిత్తం వచ్చారు. ఈ క్రమంలో తుంగభద్ర నదిలో స్నానం ఆచరించేందుకు వెళ్లి గల్లంతయ్యారు. దీంతో సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో రెస్క్యూ టీం సభ్యులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన చోటే వారి మృతదేహలు లభ్యమయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.