- కుటుంబ కలహాలతో ఎస్బీ ఎస్ఐ ఆత్మహత్య
వరంగల్ సిటీబ్యూరో (ఆంధ్రప్రభ): కుటుంబ కలహాలు ప్రాణం తీసాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చెన్నారావుపేట స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ మహ్మద్ హఫీజ్ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం గుర్తించిన సహచరులు ఆయనను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ హఫీజ్ మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

