తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూశారు. కేదార్ సెలగంశెట్టి అనారోగ్య కారణాలతో దుబాయ్లో కన్నుమూశారు. కేదార్ సెలగంశెట్టి అల్లు అర్జున్తో పాటు నిర్మాత బన్నీ వాసుకు చాలా మంచి స్నేహితుడు.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన “గం.. గణేశ” చిత్రాన్ని సెలగంశెట్టి నిర్మించారు. అయితే సుకుమార్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రానున్న భారీ సినిమాను కేదార్ నిర్మించాల్సి ఉంది. అయితే అంతలోనే కేదార్ సెలగంశెట్టి మరణించాడు.