శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం
మడకశిర, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం అక్కంపల్లి గ్రామంలోని స్విమ్మింగ్ పూల్ కు సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందినట్లు విశ్వాసనీయ సమాచారం. పట్టణంలోని మారుతీ నగర్ లో జరిగిన వివాహ వేడుకు హాజరైన కొందరు యువకులు సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లారు.
కర్ణాటకకు బాబాజన్ (35) , మనోహర్ భాష (28) మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మడకశిర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.