శ్రీశైలం-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు

శ్రీశైలం-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా పరిధి శ్రీశైలం-హైదరాబాద్(Srisailam-Hyderabad) జాతీయ రహదారి మధ్యలో ఉప్పునుంతల మండలం లత్తిపూర్ సమీపాన డిండి వాగుపై నిర్మించిన వంతెన (బ్రిడ్జి) కూలిపోవడంతో రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఈ వంతెన దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. హాజీపూర్(Hajipur) నుంచి డిండి వరకు ఉన్న వంతెనలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని డీఎస్పీ పల్లె శ్రీనివాసులు(DSP Palle Srinivasulu) సూచించారు.

