ఆమనగలు మున్సిపాలిటీలో కారు జోరు

ఆమనగల్లు, ఆంధ్రప్రభ ; ఆమనగల్లు మున్సిపాలిటీలో బిఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. తిరుగులేని ఆదిక్యాన్నిచాటుకుంది. 15 వార్డులకు గాను ఎనిమిది గెలుచుకుంది. చైర్మన్ వైస్ చైర్మన్ కు కావలసిన పూర్తి మెజార్టీ సాధించింది. నూతనంగా పార్టీలో చేరిన ప్రముఖ సంఘ సేవకుడు పాపిశెట్టి రాము, తలకొండపల్లి మాజీ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ వ్యూహం ఫలించింది. అందరి అంచనాలను తలకిందులు చేసి ఫలితాలు సాధించారు.బిజెపి పట్టు తప్పింది. ఈసారి ఆరు స్థానాలకే పరిమితమైంది. అధికార కాంగ్రెస్ పూర్తిగా చతికల పడింది. కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది.

ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆదరించలేదు. మున్సిపల్ ఫలితాలు కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని పూర్తిగా కృంగదీసింది. తీవ్ర నిరాశపరిచింది. ఆమనగలు పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల సహాయ అధికారి శంకర నాయక్ ఆధ్వర్యంలో, కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహించారు. మహేశ్వరం అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏ సి పి జానకి రెడ్డి, సీఐ జానకిరామ్ రెడ్డి పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది. అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ఎన్నికల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

Leave a Reply