Traffic Inspector | వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలి

Traffic Inspector | వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలి
- వాహనదారులకు హెల్మెట్ లు పంపిణీ
Traffic Inspector | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ మోహన్ తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ భద్రత వారోత్సవాలలో భాగంగా మంగళవారం లైన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో బొబ్బిళ్ళ మురళి ఆర్థిక సహకారంతో హెల్మెట్ లను ఇన్స్పెక్టర్ విజయ్ మోహన్ చేతుల మీదుగా వాహనదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సైదిరెడ్డి, ఏఎస్ఐ కాంట్రగడ్డ శ్రీనివాస్, లైన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవ అధ్యక్షులు తిరందాసు జగన్నాథం, ప్రధాన కార్యదర్శి అతార్ పాషా, డిసి నెంబర్స్ గోస్కె కరుణాకర్, ఉప్పు ఆంజనేయులు, కాసుల వెంకటేశం, వనం రాజు,
సత్యనారాయణ, చింతల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
