మహబూబాబాద్, ఆగస్టు 6(ఆంధ్రప్రభ) : రోడ్డు ప్రమాదంలో నర్సంపేట (Narsampet) పట్టణానికి చెందిన వ్యాపారి (Merchant) బూర అశోక్ మృతిచెందారు. గూడూరు (Gudur) నుండి నర్సంపేటకు వెళ్తున్న కారు నర్సంపేట నుండి మహబూబాబాద్ (Mahbubabad) వైపు వెళుతున్న లారీ (Lorry) ఎదురెదురుగా ఢీకొనడంతో కార్ డ్రైవర్ (Car driver) బూరా అశోక్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నర్సంపేటలోని ఐరన్ హార్డ్ వేర్ (Iron hardware) షాప్ యజమానిగా గుర్తించారు. గూడూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు.
రోడ్డు ప్రమాదం.. వ్యాపారి మృతి
