భూపాలపల్లి ప్రతినిధి / టేకుమట్ల (ఆంధ్రప్రభ) : జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లాలోని టేకుమట్ల మండల కేంద్రంలోని గర్మిళపల్లి ఓడేడు మానేరు వాగు (Odedu Maneru Vagu) లో శుక్రవారం ఉదయం ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కోసం వెళ్లిన 11 ట్రాక్టర్లు అకస్మాత్తుగా పెరిగిన వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి.

వాగు మధ్యలో ఇసుక నింపుకుంటున్న సమయంలో వాగు ఉప్పొంగి నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్రాక్టర్లు (tractors) ఎటూ వెళ్లలేని స్థితిలో నిలిచిపోయాయి. అయితే ఇసుక నింపుకున్న 5 ట్రాక్టర్లు వాగు దాటెందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో వరద ఉధృతి భారీగా పెరిగడటంతో 5 ట్రాక్టర్లు వాగు మధ్య నీటిలో చిక్కుకుని ఎటు వెళ్లలేని స్థితిలో ఉండి.. ట్రాలీలు బోల్తా పడటంతో డ్రైవర్లు (Drivers) ట్రాక్టర్ పైకి ఎక్కి కూర్చున్నారు.

అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. స్థానిక ఎస్సై సుధాకర్ (SI Sudhakar) తన సిబ్బంది, రెవెన్యూ అధికారుల (Revenue Officers) తో కలిసి సహాయక చర్యలు చేపట్టి తాళ్ల సహాయంతో డ్రైవర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ట్రాక్టర్ లని బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

Leave a Reply