హైదరాబాద్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్(Mahesh Kumar Goud) భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడుగా మహేశ్ కుమార్‌గౌడ్‌లు బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ ఏడాది కాలంగా జరిగిన పరిణామాలు, పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాలు చర్చించుకున్నారని, భవిష్యత్తు( Future) కార్యాచరణ పై కూడా చర్చించుకున్నట్లు సమాచారం.