నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం..

నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం..

మేయర్ పదవిని బీసీలకు ఇచ్చి చిత్తశుద్దిని చాటుకున్నాం..
పేద‌ కుటుంబం నుంచి వచ్చిన ఉమారాణి మేయర్ గా కావడం ఇది చరిత్రాత్మకం
టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రప్రభ) : నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని, అభివృద్ధి మా ఎజెండా.. టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో 42శాతం రిజర్వేషన్ ఇవ్వలేకపోయినా మేయర్ పదవిని బీసీలకు ఇచ్చి చిత్తశుద్దిని చాటుకున్నామన్నారు. ఇవాళ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి అయిన తర్వాత మేయర్ కూరగాయల ఉమారాణితో పాటు విలేకరులతో టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడారు.

అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ…


రెండు సీట్లున్న కాంగ్రెస్ కు ప్రజలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని‌ 17సీట్లిచ్చారన్నారు. ఎంఐఎం‌ బీఅరెస్ మద్దతుతో మేయర్ గా పేద‌ కుటుంబం నుంచి వచ్చిన ఉమారాణి మేయర్ గా కావడం ఇది చారిత్రాత్మకమని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

Leave a Reply