భక్తి, సేవ, సమాజానికి అంకిత భావం

భక్తి, సేవ, సమాజానికి అంకిత భావం
- నిజామాబాద్ లో కాంగ్రె స్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు అన్న ప్రసాదం
- భారతీయ సంస్కృతికి మూలస్తంభాలు
- సేవా కార్యక్రమాలతో పరస్పర సహకారం, సామాజిక ఐక్యత బల పడుతోంది
- టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్,ఆంధ్రప్రభ : భక్తి, సేవ, సమాజానికి అంకిత భావం మన భారతీయ సంస్కృతికి మూలస్తంభాలని టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వ హించడం ద్వారా పరస్పర సహకారం, సామాజిక ఐక్యత మరింత బలపడు తుందని ఆయన అన్నా రు. హనుమాన్ స్వామి ఆశీస్సుల తో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగా లని కోరుకున్నారు. మంగ ళవారం నగరంలోనీ హనుమాన్ జంక్షన్ వద్ద నిజామాబాద్ నగర కాంగ్రె స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హను మాన్ దీక్షా స్వాములకు నిర్వ హించిన అన్నప్రసాద వితరణ కార్యక్ర మానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీమహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై దీక్షా స్వాములకు అన్నప్రసాదాన్ని స్వయం గా వడ్డించి వారి ఆశీర్వా దాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా మహేష్ కుమా ర్ గౌడ్ మాట్లాడుతూ దీక్షలు తీసుకున్న భక్తుల ఆత్మని బద్ధత, నియమ నిష్టలు యు వతకు ఆదర్శమని తెలిపారు. హనుమాన్ దీక్షా స్వాములకు అన్న ప్రసాదం పంపిణీ చేయడం ద్వారా సేవా భావాన్ని చాటుతున్న నగర కాంగ్రెస్ కమిటీ సభ్యులను అభి నందించారు.ఈ కార్యక్ర మంలో నగర మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, ప్రజాప్రతి నిధులు, కార్యకర్తలు హనుమాన్ దీక్షా స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
