TP | ఆటంకాలు తొలగాలని..
- అఖండ సినిమా విడుదల కావాలని ఆంజనేయస్వామికి పూజలు
- బాలకృష్ణ అభిమాన సంఘం
TP | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం చిత్రం ఏ అవాంతరాలు, ఆటంకాలు లేకుండా విడుదల కావాలని అఖండ విజయం సాధించాలని ప్రార్థిస్తూ పూజలు నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం(Nandamuri Balakrishna fan club) ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని కోర్ట్ రోడ్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ పేరుమీద ఆంజనేయ స్వామికి కుంకుమార్చన చేయించి అనంతరం 101 టెంకాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ గౌస్మోదిన్, అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.

