నార్సింగి (హైదరాబాద్): హైదరాబాద్‌లో మరో లంచం ఘటన బయటపడింది. నార్సింగి (Narsingi) మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి (Town Planning Officer) మణిహారిక లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మంచిరేవులలోని ఒక ప్లాట్‌కు సంబంధించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియర్ చేయడానికి ఆమె రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ (ACB) జాగ్రత్తగా ఉచ్చుపన్నింది. మంగళవారం మణిహారిక రూ.4 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పట్టుకున్నారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని మున్సిపల్ కార్యాలయం (Municipal Office) లో సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో జారీ చేసిన ఫైళ్లు, అనుమతులను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ Dsp శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

