towards medaram | మేడారం పోదాం రావో…

మహా సంరంభానికి సమయం ఆసన్నమైంది…మేడారం జాతరకు ఊరు ఊరంతా ముస్తాబైంది..ఎక్కడెక్కడి నుంచీ భక్తులు తల్లులను దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు. చుట్టుపక్కల ఊళ్ళనుంచే కాక సుదూర గ్రామాలు, పట్నాలు..రాష్ట్రాలు…దేసాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తారని నిర్వాహకుల అంచనా.
అందుబాటులో ఉన్న వాహనాల్లో మేదారం చేరుకుంటున్నారు భక్తులు.. బండ్లు కట్టుకుని జాతర చూడడానికి పోవడమనేది తెలంగాణ ప్రాంత ప్రాచీన సంస్కృతి. ఆ సంస్కృతికి చిహ్నంగా మేడారం కి బళ్ళల్లో తరలి వస్తున్న భక్తుల బళ్ళు బార్లు తీరి దారివెంట దర్శనమిస్తూ చూపరులను ఆకర్షిస్తున్నాయి.
ఆధునికత, సాంకేతికత ఎంత వెల్లి విరిసినా, ఇంకా ఈరోజుల్లో కూడా జాతరకు ఇలా బళ్ళల్లో తరలి వెళ్ళడం గొప్ప విషయం అని ఈ దృశ్యాన్ని చూసినవారంతా ప్రశంసిస్తున్నారు.
