న్యూ ఢిల్లీ – ప్రధాని మోడీ వచ్చే నెలలో వెళ్లవలసిన రష్యా పర్యటన రద్దు అయింది.. మే తొమ్మిదో తేదిన రష్యా విక్టరీ డే వేడుకలో పాల్గొన వలసిందిగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మన ప్రధాని మోడీ ని ఆహ్వానించారు.. దీనికి అంగీకరించిన మోదీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. అయితే పహల్గామ్ సంఘటనతో పాకిస్థాన్ తో ఉద్రిక్తల పరిస్థితులు నెలకొనడంతో విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు పిఎంవో కార్యాలయం ప్రకటించింది.. అయితే భారత్ తరుపున మరో బృందాని రష్యాకు పంపనున్నట్లు పేర్కొంది..
Tour Cancelled | ప్రధాని మోడీ రష్యా పర్యటన రద్దు
