ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వచ్చే ఆదివారం ఆకాశంలో అద్భుతం చూడబోతున్నాం. ఈ నెల 7వ తేదీన ఆకాశంలో చంద్రగ్రహణం (lunar eclipse) ఏర్పడనుంది. రాత్రి 8:58 గంటలకు మొదలై 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడి.. తెల్లవారుజామున 2:25 గంటలకు గ్రహణం విడవనుంది. నార్త్, సౌత్ అమెరికా(North and South America)లోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా దేశాల ప్రజలు నేరుగా గ్రహణాన్ని చూడొచ్చని పరిశోధకులు (researchers) వెల్లడించారు.
ఆకాశం మేఘావృతమై ఉండకపోతే కనుక, డాబాపైకి ఎక్కి ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని చెప్పారు. టెలీస్కోప్ (telescope) కానీ, బైనాక్యులర్ (binoculars) కానీ అందుబాటులో ఉంటే గ్రహణాన్ని మరింత చక్కగా చూడవచ్చని తెలిపారు. రాత్రి 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని వివరించారు.