Singareni |కోల్ బెల్ట్ ఏరియాలో కుండపోత వర్షాలు.. ఓపెన్ కాస్టుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తులు!!

సింగరేణి వ్యాప్తంగా లక్షల టన్నుల ఉత్పత్తులకు ఆటంకాలు

గోదావరిఖని (ఆంధ్రప్రభ) : కోల్ బెల్ట్ ఏరియా (Coal Belt Area)లో ఎడతెలిపిలేని భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ (Singareni Open Cast) ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విస్తారమైన వర్షాల కారణంగా రామగుండం రీజియన్లు, మందమరి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియా, భద్రాది కొత్తగూడెం (Bhadradi Kothagudem) ప్రాంతాల్లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో వరద నీరు చేరుకుంది.. అక్కడ బొగ్గు ఉత్పత్తులకు అంతరాయం ఏర్పడుతుంది. పర్యావసరంగా సింగరేణి బొగ్గు పరిశ్రమలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో ఒకరోజు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు తెలుస్తోంది.

రామగుండం రీజియన్ (Ramagundam Region) లోని 1,2,3,5 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో సుమారుగా 80వేల పైచిలుకు టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు నిరంతరంగా కుండపోత వర్షంతో… ఉపరితల గనుల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులన్నీ కూడా వర్ధనీటితో జలమయంగా కనిపిస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో ఓబి మట్టి తీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు చేరడంతో… భారీ యంత్రాలు, భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇంత వర్షం వచ్చినా బొగ్గు రవాణాన్ని మాత్రం నిరాటకంగా సాగిస్తున్నారు. రెండు రోజుల్లో సుమారు లక్షా 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్, ఇందారం ఓసిపి, మందమరి కళ్యాణకని ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తులకు భారీగా అంతరాయం ఏర్పడింది.

భద్రాద్రి కొత్తగూడెం, కోయగూడెం ఉపరితల బొగ్గు గనుల్లో ఉత్పత్తులకు కూడా ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో వేలాది టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో వర్షాల కారణంగా ఓబి మట్టి తీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీరాంపూర్ మందమరి ఏరియాలో భారీ వర్షాల కారణంగా సుమారుగా ఒకరోజు 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారీ వర్షాల కారణంగా బొగ్గు రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా సింగరేణి అధికారులు కోల్ యార్డులో నిల్వ ఉన్న బొగ్గును విద్యుత్ ప్లాంట్లతో పాటు ఇతర పరిశ్రమలకు బొగ్గు రవాణా చేపడుతున్నారు. బొగ్గు రవాణాకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

శ్రీపాద “ఎల్లంపల్లి”కి భారీగా వరద నీరు…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దపెల్లి జిల్లా అంతర్గంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బారిగా వరద నీరు చేరుకుంది. 142.96 లెవెల్ లో ప్రాజెక్టులో నీటి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.8832 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు చెప్తున్నారు. 2334 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో అవుతుంది. అదేవిధంగా సుందిళ్ల పార్వతి బ్యారేజ్ కి సంబంధించి 74 గేట్లన్నీ ఎత్తి వరద నీ ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు.

Leave a Reply