Tools | రాయితీ పై రోటవేటర్లు, ట్రాక్టర్ పనిముట్లు

Tools | రాయితీ పై రోటవేటర్లు, ట్రాక్టర్ పనిముట్లు

Tools | వేంసూరు,ఆంధ్రప్రభ; వ్యవసాయ యాంత్రీకరణ పథకం లో భాగంగా మండలంలోని రైతులకు సబ్సిడీపై రోటవేటర్లు, ట్రాక్టర్ పనిముట్లు పొందేందుకు దరఖాస్తులు చేయాల్సిందిగా మండల వ్యవసాయ అధికారి రామమోహన్ ఒక ప్రకటనలో కోరారు.


2025- 26 ఆర్థిక సంవత్సరానికిగాను వేంసూరు మండలానికి 6 రోటావేటర్లు, 11 ట్రాక్టర్ పని ముట్లు సబ్సిడీ పై అందించేందుకు బడ్జెట్ కేటాయింపు జరిగిందన్నారు. ఈ పరికరాలు కావలసిన రైతులు ఈనెల 18 వ తేదీ లోపు వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేయాలని కోరారు. దరఖాస్తు ఫారంతో పాటు ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్ సి అగ్రికల్చర్ పర్పస్) ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, పాసుపోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply