మేషం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. బంధువిరోధాలు. కృషి ఫలించదు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృషభం: అంచనాలు తప్పుతాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.
మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. మీ సత్తా చాటుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వేడుకల్లో పాల్గొంటారు.
కర్కాటకం: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరిలోనూ గుర్తింపు. యత్నకార్యసిద్ధి. బంధువుల నుంచి శుభవర్తమానాలు. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం: పనుల్లో ఆటంకాలు. వృధా ధనవ్యయం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కన్య: ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. పనుల్లో ఆటంకాలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం. అనారోగ్యం. ఆలయ దర్శనాలు.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. చిత్రమైన సంఘటనలు. అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం: కుటుంబంలో చికాకులు. ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.
ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వాహనయోగం.
మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.
కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. కొన్ని సమస్యలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆస్తి లాభ సూచనలు.–
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
