Telangana | ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి

Telangana | ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి

Telangana | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : టర్మినేషన్ ఉత్తర్వులు (termination orders) వెనక్కి తీసుకోవాలని సి ఆర్ పి ల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు అంబదాస్ రావు (Ambadas Rao), పొలాస అంజయ్య (Polasa Anjaiah)లు కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా, పెద్ద కొత్తపల్లి మండలంలో ఒక పాఠశాలకు సంబంధించిన పార్ట్ 2 పాఠ్య పుస్తకాలు ఎంఆర్ సి నుండి తీసుకెళుతున్న ఆటో బోల్తా పడి విద్యార్థులు గాయపడ్డారు.

ఆ సందర్భంలో విద్యార్థులను పాఠ్య పుస్తకాలు మోయడానికి తీసుకువచ్చిన ప్రధానోపాధ్యాయుడిని బాధ్యులను చేయడం సబబే.. కానీ కేవలం ఎం ఆర్ సి లో పుస్తకాలు పంపిణీ చేసిన, ఈ ప్రమాద సంఘటనకు ఎటువంటి సంబంధం లేని ఎం ఆర్ సి స్టాఫ్ (సి ఆర్ పి, ఎం ఐ ఎస్) లకు ఏకంగా టెర్మినేషన్ ఆర్డర్స్ ఇవ్వడం సరైనది కాదని తెలిపారు.

కమ్మర్ పల్లి (kammarpally) మండల ఎం ఆర్ సి కార్యాలయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పునరాలోచించి ఎస్ పి డి, నాగర్ కర్నూల్ డి ఈ వో, ఎం ఆర్ సి స్టాఫ్ ను టెర్మినెట్ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Leave a Reply