Tiryani | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా

Tiryani | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
- తిర్యాణి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మడవి విశ్వప్రసాద్
Tiryani | తిర్యాణి, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల్లో ఆదరించి సర్పంచ్‌గా గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మడవి శివప్రసాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మండలంలోని తిర్యాణి గ్రామంలో వార్డు మెంబర్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు తనను గెలిపిస్తే తిర్యాణి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతే తన ధ్యేయమని, గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
