Tirupathi | యువకుడి ఆశల “ఊపిరి” తీసిన గుండె పోటు

తిరుప‌తి – ఈ మ‌ధ్య కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా గుండెపోటు (heart stroke ) మ‌ర‌ణాలు (deaths ) సంభ‌విస్తున్నాయి. చిన్న‌య‌సులోనే (early age ) గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే తిరుప‌తి జిల్లాలో (tirupathi district) చోటు చేసుకుంది. జిల్లాలోని నాగ‌ల‌పురం మండ‌లం సురుటుప‌ల్లికి (surutupalli ) చెందిన భాస్క‌ర్ (21) (bhaskar ) స్నేహితులతో క‌లిసి రన్నింగ్ చేస్తూ గుండెపోటుతో మ‌ర‌ణించాడు. డిగ్రీ పూర్తి చేసిన భాస్క‌ర్ స్నేహితుల‌తో క‌లిసి కొద్దిరోజులుగా పోలీస్ ఉద్యోగం సాధించాల‌ని ఈవెంట్స్ (events ) కోసం ప్రాక్టీస్ (practice ) చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే గుండెపోటు రావ‌డంతో చ‌నిపోయాడు. చేతికొచ్చిన కొడుకు మ‌ర‌ణంతో త‌ల్లి దండ్రులు, కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.

Leave a Reply