Tirumala | శ్రీవారి సేవలో పూజా హెగ్డే …

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ స్టార్‌ నటి బుట్ట బొమ్మ పూజా హెగ్డే దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతంపలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నటిని శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

అంతకుముందు పూజా హెగ్డే తిరుపతి జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న విషయం తెలిసిందే. గురువారం ఉద‌యం శ్రీ కాళ‌హ‌స్తికి వెళ్లిన నటి.. అక్కడ రాహుకేతు పూజలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకున్నారు. సినిమాల విష‌యానికి వ‌స్తే.. పూజా ప్రస్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో జ‌న‌నాయ‌గ‌న్ సినిమాలో న‌టించడంతో పాటు సూర్య హీరోగా వ‌స్తున్న రెట్రో చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Leave a Reply