Tirumala| శ్రీ‌వారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌..

Tirumala| శ్రీ‌వారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌..

  • చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
  • ఉదయం 9 గంటల నుంచి తలుపుల మూసివేత
  • వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు పలు ఆర్జిత సేవలు రద్దు
  • గ్రహణం అనంతరం శుద్ధి చేసి రాత్రి 8:30 నుంచి దర్శనాలు

తిరుప‌తి, ఆంధ్ర‌ప్ర‌భ : చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఆ రోజు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు గ్రహణం ఉంటుందని చెప్పారు. అదే రోజు కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయని, వాటికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఆలయ తలుపులు తెరిచిన తర్వాత శుద్ధి, పుణ్యాహవచనం వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించి, రాత్రి 8:30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గ్రహణం కారణంగా ఆ రోజు నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఇదే రోజు కుమారధార తీర్థం ముక్కోటి ఉత్సవాలు కూడా జరగనున్నాయని, వాటికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పులను గమనించి, భక్తులు తమ తిరుమల యాత్రను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

ఈనెల 26 నుంచి మార్చి 2 వరకు తిరుమలలో తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 20 నుంచి మార్చి 5 వరకు పుష్కరిణీ స్నానానికి భక్తులకు అనుమతి ఉండదని చెప్పారు. పుష్కరిణి, ప్రవేశ, నిష్కమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది, పుష్కరిణిలో అందుబాటులో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తెప్పోత్సవాల కారణంగా ఈనెల 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, వచ్చేనెల 3న కుమారధార తీర్థ ముక్కోటి సందర్భంగా భక్తులను ఉదయం 5 నుంచి 9గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు.

Leave a Reply