Time Change | విజ‌య‌వాడ‌లో రేవంత్ … టెన్త్ ఫ‌లితాల విడుద‌ల స‌మ‌యంలో మార్పు

హైద‌రాబాద్ – విజయవాడలోని ఒక శుభకార్యానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకావడంతో నేడు విడుదల కావాల్సిన టెన్త్ రిజల్ట్స్ సమయంలో మార్పు చేశారు.. ముందుగా ప్రకటించినట్లు మధ్యాహ్నం ఒంటి గంట‌కు కాకుండా 2.15 కి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఎస్ఎస్ సి బోర్డు ప్ర‌క‌టించింది…

ఇది ఇలా ఉంటే ఏపీ మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కుమారుడి వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఇవాళ కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రికి ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, జనార్దన్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. వివాహ వేడుకకు రేవంత్, నారా లోకేశ్ కలిసి వెళ్లారు. కొత్త‌జంట‌ను ఆశీర్వ‌దించి వారిలో క‌ల‌సి రేవంత్ ఫోటోలు దిగారు..

Leave a Reply