FIELDS | మళ్ళీ పులి పంజా !

FIELDS | మళ్ళీ పులి పంజా !
పులివెందుల జనం గగోలు
వెంకటాపురం పొలాలలో గుర్తించిన రైతులు
FIELDS | పులివెందుల , ఆంధ్రప్రభ : పులివెందుల శివారులలో కొత్తపల్లి రోడ్డు సమీపంలో ఉన్న వెంకటాపురం పొలాల్లో పులి అడుగులు (Tiger footprints in the fields) కనిపించాయని ఆ గ్రామ రైతులు అంటున్నారు. పులి అడుగులు చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు కలగజేసుకొని అవి పులి కాలిగుర్తిలో లేక ఏ గుర్తులు తెలియజేయాలని రైతన్నలు కోరుతున్నారు. అలాగే పొలాలలో గుర్తులు ఉన్నచోట సీసీ కెమెరాలు బిగించాలని రైతుల కొడుతున్నారు. పొలాలలో అరటి టమోటా ఇతర రకాల కూరగాయలకు సంబంధించిన పంటలు కోసేందుకు సిద్ధంగా ఉన్నాయని అటువైపు వెళ్లాలంటే పులులు ఎక్కడ మీద పడతాయో అని భయాందోళనకు రైతులు గురవుతున్నారు.
ఈ విషయంపై ఫారెస్ట్ ఆఫీసర్ గోపాలకృష్ణను వివరణ కోరగా
రైతులు పొలాల వద్ద పులి అడుగులు ఉన్నాయని చెప్తూ ఉంటే మేము ఉన్నతాధికారులకు సమాచారం అందించామని రైతులొస్తే (Farmers) వారితో వెళ్లి వాటి గుర్తులను పరిశీలించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అత్యవసరమైతే ఉన్నతాధికారులకు తెలియజేసి సిసిఆర్ కెమెరాలు కూడా బిగిస్తామన్నారు. అంతవరకు పొలాలకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలన్నారు.
