Nandyala | గిరిజనుడిపై పులి దాడి.. భయాందోళనలో గూడెం ప్రజలు..

నంద్యాల బ్యూరో, జులై 22 ఆంధ్రప్రభ : నంద్యాల (Nandyala) జిల్లాలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం (Srisailam) నియోజకవర్గంలోని ఆత్మకూరు (atmakur) అటవీ రేంజ్ పరిధిలో ఉన్న చెంచు యువకుడిపై పెద్దపులి (tiger) దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది.

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం (Kothapalli Mandalm) సదరం పెంట చెంచు గూడానికి చెందిన పులిచెర్ల అంకన్నపై పెద్దపులి దాడి‌ చేయటం తీవ్ర కలకలం రేపింది. అంకన్న (Ankanna) కు తీవ్ర గాయాలయ్యాయి. అంకన్న శరీరంపై పలు చోట్ల దాడి చేసింది. శరీరంపైన కాలిపైన, చేతుల పైన, దాడి చేసింది. గూడెం శివారులో బహిర్భూమికి వెళ్ళిన చెంచు యువకుడిపై పులి దాడి చేయటంతో గ్రామస్తులందరూ ఒక్కసారిగా కర్రలు పట్టుకుని కేకలు వేసుకుంటూ బయటికి రావటంతో ఆ పులి అడవిలోకి పారిపోయింది.

గూడెంవాసులు కేకలు వేయడంతో పులి యువకుడిని వదిలి అడవిలోకి వెళ్ళింది. పులి దాడిలో ప్రాణాలతో బయటపడ్డ గిరిజనుడు అంకన్నను మెరుగైన వైద్య సేవల కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్సను ఇప్పిస్తున్నారు. భయాందోళనకు గురవుతున్న నల్లమల్ల చెంచు గిరిజన గూడెం ప్రజలు, అటవీ శాఖ అధికారులు ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు.

Leave a Reply