చిట్యాల, ఫిబ్రవరి 27 (ఆంధ్రప్రభ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట చలివాగుపై, నిర్మించిన చెక్ డ్యాంకు గుర్తుతెలియని వ్యక్తులు గండికొట్టారు. దీంతో నీరు టేకుమట్ల మండలంలోని పలు గ్రామాలకు చలివాగు ప్రవహిస్తుంది.
శివారులోని పంట పొలాలకు సాగునీటి కోసం రైతులు ఈ పని చేసి ఉండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చలివాగులో స్టోర్ అయిన నీళ్లు మొత్తం కింది ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉందని, కాగా పైన పంటలు వేసుకున్న పొలాల రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.