ఆ చోరీలు వీడియో గేంల లానే అనిపిస్తాయి…
ఉత్కంఠను రేకెత్తిస్తాయి…
ఆ చేజింగులూ…
ఫైటింగులూ..అచ్చం ఆర్జీవి సినిమాలనే తలపిస్తాయి.
అక్కడ రికార్డయిన సీసీటీవీల ఫుటేజీలను
అన్ని న్యూస్ చానెళ్ళూ అపురూపంగా అందుకుని పదేపదే వేసి ఊదరగొట్టేస్తుంటాయి.
ఈ చోరీలేమిటని అనుకుంటున్నారా?
అవేనండీ…కొన్నిజ్యూయలరీషాపుల దోపిడీలు.
అయితే, అవి నిజమైనవేనా అంటే…అదిమాత్రం అడగొద్దు.
అది వేరే లెక్క…దాని కథా-కమామిషూ వేరే…ఆ లెక్కే సెప”రేటూ”
వాళ్ళు చాలా జాగ్రత్తగా ముసుగులు వేసుకుని షాపులోకి ప్రవేశించి, అందినవన్నీ దోచేసుకుని…పరారవుతూంటారు..పోలీసులు ఎంటరైపోయి వీరోచితంగా వెంటాడి, వాళ్ళని పట్టేసుకుంటారన్నమాట. దొరికారా సరే…లేదా పోలీసులు పదేసి బృందాలుగా విడిపోయి…
చకచకా వెతికేస్తారు…ఈలోగా ఉన్నతస్థాయిలో ఈ దోపిడీని సీరియస్ గా తీసుకున్న మంత్రులు కాస్తా పోలీసుల మీద ఒత్తిడి తెస్తారు. పదేసి బృందాలుగా విడిపోయిన పోలీసులు కాస్తా వాళ్ళను పట్టేసుకుని, వారి మొహాలపైన పైన నల్లటి గుడ్డలు కప్పేసి మీడియా ముందు నిలబెట్టేస్తారు. ఏ నల్లని ముసుగులలో…ఏ మొహములు దాగెనో..అని ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం చేయగలం?
దీని వెనక మాత్రం అనేక పథక రచనలు ఉంటాయని పలువురి అభిప్రాయం.
ఆదాయపన్ను ఎగవేతకు, ఇన్ష్యూరెన్సు డబ్బు క్లెయిములకు ఇదో చక్కటి రాచమార్గమనేది బహిరంగ రహస్యం. పోయిందని చెబుతున్న సొమ్ముల్లో చాలావరకు నకిలీవి పెట్టేయడం…
వాటి స్థానంలో ఉండాల్సిన అసలు నగలు భద్రంగా దాచేసుకోవడం ఒక టెక్నిక్.
చోరీలు చేయించుకోవడాలూ, షార్ట్ సర్క్యూట్ పేరిట తమ ఫైళ్ళను తామే తగలబెట్టుకోవడాలూ అన్నీ సుపారీలతోనే జరుగుతుంటాయని కొందరంటారు.
నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి మనే విధంగా ఉండే ఈ చోరీలను చూస్తూంటే సుపారీ చోరీలు కాక ఇంకేమనిపిస్తుంది?
సుపారీ చోరీ ?
