36గంటల్లోపు ఆ గుడిసెలను తొలగించాలి

36గంటల్లోపు ఆ గుడిసెలను తొలగించాలి

సూచనలు పాటించకుంటే గుడిసెలు మేమే తొలగిస్తాం


దండేపల్లి, నవంబర్ 4(ఆంధ్రప్రభ): దండేపల్లి మండలంలోని తాళ్ళపేట అటవీ రేంజ్ పరిధిలోని లింగాపూర్ బీట్ లో దమ్మన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసీలు అక్రమంగా వేసుకున్న గుడిసెలను తొలగించాలన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (Collector Kumar Deepak) సూచనల మేరకు, దండేపల్లి మండల తహసీల్దార్, రోహిత్ దేశ్పాండే తో కలిసి లింగాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా ఉన్న దమన్నపేట గ్రామస్థుల వద్ధకు వెళ్లి అక్రమంగా వేసుకున్న 36 గంటలలోపు గుడిసెలను తొలగించాలని, వి ఎస్ ఎస్, గ్రామ పంచాయతీ తీర్మానాలను సమర్పించారు.

అటవీ ప్రాంతంలో నీలగిరి, వెదురు ప్లాంటేషన్ (Bamboo plantation) ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. సూచనలను పాటించని పక్షంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, పంచాయతీ రాజ్, రెవెన్యూ అండ్ అటవీ శాఖలు సంయుక్తంగా 36గంటల తరువాత ఆక్రమణలను తొలగించి ప్లాంటేషన్ చేపడతారని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి, ఎంపిడిఓ ప్రసాద్, ఇంచార్జి ఎఫ్ ఆర్ ఓ లక్ష్మి నారాయణ, డిప్యూటీ రేంజర్ సాగరిక, సెక్షన్ఆఫీసర్ రాజేందర్, అటవీ శాఖ సిబ్బంది, మండల ప్రజా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply