IPL-2026 | రిటెన్షన్ లిస్ట్ ఇదే

IPL-2026 | రిటెన్షన్ లిస్ట్ ఇదే

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL-2026 రిటెన్షన్‌ జాబిత వచ్చేసింది. రిటైన్‌, రిలీజ్‌ చేసిన ఆటగాళ్ల పూర్తి వివరాలను ఫ్రాంచైజీలు గడువు చివరి తేది నవంబర్‌ 15న (శనివారం) అధికారికంగా ప్రకటించాయి. కాగా, ఈ 19వ సీజన్‌కు సబంధించిన మినీ వేలం డిసెంబర్‌ 15న అబుదాబిలో జరగనుంది.

అయితే ఫ్రాంచైజీల్‌ కొందరూ స్టార్‌ ఆటగాళ్లకు ఊహించని షాకిచ్చాయి. తమ జట్లకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన కీలక ఆటగాళ్లను సైతం వేలంలోకి వదిలేసి అందరిని ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా కేకేఆర్ జ‌ట్టు.. ఆండ్రీ రస్సెల్‌, డికాక్‌, గుర్బాజ్‌లతో పాటు గత వేలంలో (రూ. 23.75 కోట్లు) రికార్డు ధరకు సొంతం చేసుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ను సైతం జట్టు నుంచి రిలీజ్‌ చేసేసింది.

మరోవైపు హైదరాబాద్‌ జట్టు సన్‌రైజర్స్‌ కీలక బౌలర్లు మహ్మద్‌ షమీని లక్నోకు ట్రేడ్‌ చేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా కెప్టెన్‌ సంజూ శాంసన్‌, సీఎస్కే స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాలు కూడా ఫ్రాంచైజీలు మారారు.

IPL-2026 | ఫ్రాంచైజీలు రిలీజ్‌ చేసిన ఆటగాళ్ల వివరాలు..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: అభినవ్‌ మనోహర్‌, అథర్వ తైదే, సచిన్‌ బేబీ, వియాన్‌ ముల్డర్‌, సిమర్‌జీన్‌ సింగ్‌, రాహుల్‌ చాహర్‌, ఆడమ్‌ జంపా.
చెన్నై సూపర్‌ కింగ్స్‌: రచిన్‌ రవీంద్ర, దీపక్‌ హూడా, మతీశ పతిరణ, విజయ్‌ శంకర్‌, షేక్‌ రషీద్‌, రాహుల్‌ త్రిపాఠి, వన్ష్‌ బేబి, ఆండ్రీ సిద్దార్థ్‌, కమలేశ్‌ నగార్‌కోటి.

ముంబై ఇండియన్స్‌: రీస్‌ టాప్లీ, కర్ణ్‌ శర్మ, ముజీబుర్‌ రహ్మాన్‌, సత్యనారాయణ రాజు, బెవాన్‌ జాకబ్స్‌, కేఎల్‌ షీర్జిత్‌, విజ్ఞేశ్‌ పుతుర్‌, లిజాడ్‌ విలియమ్స్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: ఆండ్రీ రస్సెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, క్వింటన్‌ డికాక్‌, ఆన్రిచ్‌ నోకియా, మొయిన్‌ అలీ, స్పెన్సన్‌ జాన్సన్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌, చేతన్‌ సకరియా, లువినిత్‌ సిసోడియా.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: మయాంక్‌ అగర్వాల్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, లుంగి ఎంగిడి, టిమ్‌ సిఫర్ట్‌, ముజారబనీ, స్వస్తిక్‌ చీకారా, మనోజ్‌ భాడ్గే, మోహిత్‌ రాఠి.

IPL-2026

పంజాబ్‌ కింగ్స్‌: జోష్‌ ఇంగ్లిస్‌, ఆరోన్‌ హర్డీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ప్రవీణ్‌ దూబె, కుల్దిప్‌ సేన్‌.

ఢిల్లి క్యాపిటల్స్‌: ఫాఫ్‌ డుప్లెసిస్‌, జాక్‌ ఫ్రెజర్‌, సేథికుల్లా అటల్‌, మోహిత్‌ శర్మ, దర్శన్‌ నల్కండే, మన్వంత్‌ కుమార్‌.

గుజరాత్‌ టైటాన్స్‌: మహిపాల్‌ లామ్రోర్‌, కరీమ్‌ జన్నత్‌, డాసన్‌ శనక, గెరాల్డ్‌ కోయెట్టి, కుల్వంత్‌ కుజ్రోలియా.

లక్నో సూపర్‌ జెయింట్స్‌: డేవిడ్‌ మిల్లర్‌, రవి బిష్ణోయ్‌, ఆర్యన్‌ జుయల్‌, షమర్‌ జోసెఫ్‌, ఆర్యన్‌ జుయల్‌, యువరాజ్‌ చౌదరి, రాజ్యవర్దన్‌ హంగర్కేకర్‌, ఆకాశ్‌ దీప్‌.

IPL-2026

రాజస్తాన్‌ రాయల్స్‌: వనిందు హసరంగ, మహీశ్‌ తీక్షణ, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, ఆకాశ్‌ మధ్వాల్‌, కుమార్‌ కార్తికేయ, కునాల్‌ రాథోడ్‌, అశోక్‌ శర్మ.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రిటైన్‌ చేసుకున్న లీస్ట్‌: పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, అనికేత్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హెన్రిచ్‌ క్లాసన్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, స్మారన్‌, హర్ష్‌ దూబే, కమిందు మెండిస్‌, హర్షల్‌ పటేల్‌, బ్రైడన్‌ కార్స్‌, జయ్‌దేవ్‌ ఉనద్కాట్‌, ఎషాన్‌ మలింగ, జీషాన్‌ అన్సారి.

ట్రేడ్‌ అయిన ప్లేయర్ల జాబిత: రవీంద్ర జడేజా (రూ. 14 కోట్లు) సీఎస్కే నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌కు, మహ్మద్‌ షమీ (రూ. 10 కోట్లు) సన్‌రైజర్స్‌ నుంచి లక్నో సూపర్‌ జెయింట్స్‌కు, శార్దూల్‌ ఠాకూర్‌ (రూ. 2 కోట్లు) లక్నో సూపర్‌ జెయింట్స్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు, సామ్‌ కరన్‌ (రూ. 2.4 కోట్లు) సీఎస్కే నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌కు, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (రూ. 2.6 కోట్లు) గుజరాత్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు, నితీశ్‌ రాణా (రూ. 4.2 కోట్లు) రాజస్తాన్‌ నుంచి ఢిల్లి క్యాపిటల్స్‌కు, డొనావన్‌ ఫెరీరా (రూ. 1 కోటి) ఢిల్లిd క్యాపిటల్స్‌ నుంచి రాజస్తాన్‌కు, అర్జున్‌ టెండూల్కర్‌ (రూ. 30 లక్షలు) ముంబై ఇండియన్స్‌ నుంచి లక్నో సూపర్‌ జెయింట్స్‌కు, మయాంక్‌ మార్ఖండే (రూ. 30 లక్షలు) కోల్‌కతా నుంచి ముంబైకు ట్రేడ్‌ అయ్యారు.

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌ ప్రక్రియ పూర్తయింది. ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న, రిలీజ్‌ చేసిన ఆటగాళ్ల పూర్తి వివరాలను వెల్లడించాయి. డిసంబర్‌లో జరిగే మినీ వేలం కోసం ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత పర్స్‌ అమౌంట్‌ మిగిలి ఉందో ఓసారి చూద్దాం.
పర్స్‌ అమౌంట్‌: ఏ జట్టు దగ్గర ఎంత మిగిలిందంటే..

కేకేఆర్‌ వద్ద అత్యధికంగా రూ. 64.30 కోట్లు ఉంటే.. అత్యల్పంగా ముంబై వద్ద ర. 2.75 కోట్లు మాత్రమే ఉంది. ఇక ఇతర ఫ్రాంచైజీలు సీఎస్కే (రూ. 43.40 కోట్లు), సన్‌రైజర్స్‌ (రూ. 25.50 కోట్లు), లక్నో (రూ. 22.95 కోట్లు), ఢిల్లి (రూ. 21.80 కోట్లు), రాజస్తాన్‌ (రూ. 16.05 కోట్లు), ఆర్సీబీ (రూ. 16.40 కోట్లు), గుజరాత్‌ (రూ. 12.90 కోట్లు), పంజాబ్‌ (రూ. 11.50 కోట్లు) మిగిలి ఉన్నాయి.

cricket | శుభారంభం

Leave a Reply