RTI – ఆర్టీఐ లక్ష్యం ఇదే..

RTI – ఆర్టీఐ లక్ష్యం ఇదే..

యాదాద్రి, ఆంధ్రప్రభ, ప్రతినిధి – ప్రభుత్వం ప్రజలకు జవాబుదారి తనం, పారదర్శకతే లక్ష్యంగా సమాచార హక్కు చట్టం కమిషన్ ముందుకు సాగుతుందని ఆర్టీఐ (RTI) కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి, పర్వీన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఐ దరఖాస్తుల హియరింగ్ లో పాల్గొని మాట్లాడారు. అవినీతి నిర్ములన కోసం ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేయాలని కోరారు. రాష్ట్రంలో 18 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, 5 నెలల కాలంలోనే 5 వేలకు పైగా దరఖాస్తులు పూర్తి చేశామని చెప్పారు. రాష్ట్రంలో 15 జిల్లాలో సమావేశాలు పూర్తి చేసి, 16 వ జిల్లాగా యాదాద్రి (Yadhadri) భువనగిరి జిల్లాకు వచ్చామని చెప్పారు.

13 శాఖల్లో దరఖాస్తులు పూర్తి చేశామని చెప్పారు. సమాచార హక్కు చట్టం పై నిర్లక్ష్యం వహిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకు ముందు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్, భూపాల్, కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ (DCP) ఆకాంక్ష్ యాదవ్, అదనపు కలెక్టర్ లు వీరా రెడ్డి, భాస్కర్ రావ్, ఆర్డీవో కృష్ణా రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply