జన్నారం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(Teacher Award) తీసుకున్న దాముక కమలాకర్, పుష్పలత దంపతులు తల్లిదండ్రులను కలిసి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(State Chief Minister Revanth Reddy) చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ టీచరు అవార్డు అందుకున్న మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్, ఉపాధ్యాయుడు దాముక కమలాకర్(Kamalakar) ఆదివారం మండలంలోని రేండ్లగూడలోని తల్లిదండ్రులు దాముక రాజారత్నం, సూర్యకాంతను కలిసి సీఎం నుంచి అందుకున్న అవార్డు మెడల్, సర్టిఫికెట్, రూ.10 వేల చెక్కును ఇచ్చి, పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందారు.

ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువులు నేర్పిన క్రమశిక్షణ(Discipline)తోనే ఇంత ఎదిగానన్నారు. కష్టపడి పనిచేసే విధానం, వృత్తి పట్ల గౌరవం, పాఠశాల పట్ల ప్రేమ విద్యార్థులు కలిగి ఉండాలనే తల్లిదండ్రులు చెప్పిన మాటలు, గురువులు నేర్పిన విద్యాబుద్ధుల(Discipline, Educational Excellence) వల్లనే అవార్డు రావడానికి కారణమని ఆయన అన్నారు.

జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యనేర్పిన గురువులకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు. అందరి సహాయ, సహకారాల వల్లనే తానీ అవార్డు అందుకొన్నానని, అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply