అలారం మోగ‌డంతో దొంగ ప‌రుగోప‌రుగు

అలారం మోగ‌డంతో దొంగ ప‌రుగోప‌రుగు

ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కిసాన్ చౌక్(Kisan Chowk) ప్రధాన కూడలిలో ఓ ప్రైవేట్ బ్యాంకు ఏటీఎం చోరీకి దొంగ విఫలయత్నం చేశారు. లాడ్జి కింద ఉన్న డీబీఎస్ ఏటీఎం(DBS ATM)లోకి ఈ రోజు తెల్ల‌వారు జామున ఓ దొంగ చొరబడి గడ్డపారతో ముందుగా మిషన్‌(Mission)ను ధ్వంసం చేశాడు.

లాక‌ర్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. అంతలోనే అలారం మోగడంతో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు అప్రమత్తమై వెంటనే అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ దొంగ(Thief) అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఏటీఎం నిందితుడు రైల్వే స్టేషన్(Railway Station) వద్ద పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. పట్టణ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నెలరోజుల కిందట ఆదిలాబాద్ రామ్ నగర్ ప్రాంతంలో ఓ ఏటీఎంను రాడ్ కట్టర్ల(Rod Cutters)తో ధ్వంసం చేసి రూ. 14 లక్షల క్యాష్ ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.

Leave a Reply