హమాలీ దారుణ హత్య..

మహబూబ్ నగర్, దేవరకద్ర, క్రైమ్, ఆంధ్రప్రభ : దేవరకద్ర మండల పరిధిలో నిన్న రాత్రి దారుణ హత్య జరిగింది. దేవరకద్ర (Devarakadra) మండలం అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన దానం మైబు (40) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ శివారులో కాపు కాసి దారుణంగా నరికి హత్య (murder) చేశారు. మైబు వృత్తిరీత్యా దేవరకద్ర మార్కెట్ యార్డులో హమాలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

రోజులాగే నిన్న రాత్రి మైబు తన పని ముగించుకొని 9:30 గంటల సమయంలో తన గ్రామానికి తన మోటార్ సైకిల్ పై వస్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు, పోలీసులు (police) తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించామని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకద్ర ఎస్ఐ నాగన్న తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నట్లు చెప్పారు.

Leave a Reply