జీవిత పాఠాలు నేర్పేది వీరే !

సబ్బవరం : తల్లిదండ్రులే మనకు తొలి ఉపాధ్యాయులని, వారు మనకు కేవలం జన్మనిచ్చేవారు మాత్రమే కాకుండా, మొదటి అక్షరం నేర్పినవారు, మొదటి అడుగు వేయించినవారని హోం మంత్రి అనిత అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సబ్బవరంలోని తన తల్లిదండ్రులను ఆమె కలసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. తల్లి ప్రేమతో ఓర్పు నేర్పుతుంది. తండ్రి క్రమశిక్షణ, ధైర్యం, కృషి విలువలను బోధిస్తారు. వీరిద్దరూ కలిసి జీవిత పాఠశాలలో మూలగురువులుగా నిలుస్తారు. ప్రతి మలుపులోనూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు అని తెలిపారు.

తన తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారని, వేలాది మంది విద్యార్థులను ఉన్నత విలువలతో ఎదిగేలా చేసిన వారిగా గర్వంగా ఉందన్నారు. నా తండ్రి ప్రస్తుతం రిటైర్డ్ అయినా, తల్లి ఇంకా ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్నారు. తరగతి గదిలో పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పిన వారి వల్లనే నేను ఈ స్థాయికి చేరగలిగాను అని మంత్రి అనిత పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తనకు మరింత శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పారు.

Leave a Reply