జన్నారం మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు గురువారం రాత్రి వెలువడ్డాయి. మండలంలోని మొత్తం 29 గ్రామ పంచాయతీలకు గాను, రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ రెండు పంచాయతీలలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మిగిలిన 27 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో గెలిచిన సర్పంచుల వివరాలను స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) హుమర్ షరీఫ్ గురువారం రాత్రి అధికారికంగా వెల్లడించారు.
- రెండ్లగూడ: అల్లం మాధవి-రవి (కాంగ్రెస్)
- బంగారుతాండ: భూక్య నిర్మలబాయి (కాంగ్రెస్)
- చింతలపల్లి: పంజాల సురేష్
- లోతొర్రె: బోడ శంకర్ (కాంగ్రెస్, ఏకగ్రీవం)
- లింగయ్యపల్లె: కొత్తపల్లి వనిత-శ్రీనివాస్ (కాంగ్రెస్, ఏకగ్రీవం)
- కొత్తపేట: దినేష్ కుమార్ పవర్ (బీఆర్ఎస్)
- రాంపూర్: నూతి రామయ్య (కాంగ్రెస్)
- మహ్మదాబాద్: రామటెంకి శంకర్ (బీఆర్ఎస్)
- సింగరాయిపేట: తోడసం రజిత
- మల్యాల: కుర్ర భాగ్యలక్ష్మి
- హాస్టల్ తాండ: బాదావత్ జయశ్రీ-సంతోష్ (బీఆర్ఎస్)
- మోర్రిగూడ: తాళ్లపల్లి విజయ (బీఆర్ఎస్)
- వెంకటాపూర్: మెస్రం రాజ్ కుమార్ (బీఆర్ఎస్)
- రోటిగూడ: జిల్లపల్లి గోపాల్ (బీజేపీ)
- తిమ్మాపూర్: గూగులావత్ సంగీత (కాంగ్రెస్)
- తొమ్మిది గుడిసెలపల్లి: కుదిరె వెంకటి (కాంగ్రెస్)
- కామన్ పల్లి: పేరం శ్రీనివాస్ (బీఆర్ఎస్)
- బాదంపల్లి: సామల్ల విజయలక్ష్మి-లక్ష్మీరాజం (బీజేపీ)
- కిష్టాపూర్: వాసాల నరేష్ (బీజేపీ)
- కవ్వాల: లాకావత్ సక్రు నాయక్ (కాంగ్రెస్)
- మురిమడుగు: యాదగిరి భారతి (బీఆర్ఎస్)
- ధర్మారం: ఆత్రం గోదావరి (బీఆర్ఎస్)
- తపాల్ పూర్: మురిమడుగుల కవిత
- దేవునిగూడ: రామటెంకి రాజేష్ (కాంగ్రెస్)
- ఇందనపల్లి: గూగులావత్ శంకర్ (స్వతంత్ర)
- జన్నారం: అజ్మీర కళావతి-నందునాయక్ (కాంగ్రెస్)
- కలమడుగు: బొంతల నాగమణి-మల్లేష్ (కాంగ్రెస్)
- చింతగూడ: సుతారి సుమలత-వినయ్ కుమార్ (బీఆర్ఎస్)
పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్నాయి…
