వెంట‌నే బాగు చేయండి..

వెంట‌నే బాగు చేయండి

  • తాండూరులో ప్ర‌జ‌ల ఆగ్ర‌హం
  • ఆందోళ‌న‌.. రోడ్డుపై బైఠాయింపు
  • తాండూరు డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిరసన
  • పార్టీలకతీతంగా తరలి వచ్చిన నాయకులు

తాండూరు, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రజలు ఆగ్రహించారు. అధ్వానంగా మారిన రోడ్లను బాగు చేయాలంటూ ఆందోళనకు దిగారు. మంగళవారం తాండూరు డెవలప్‌మెంట్‌ ఫోరమ్ ఆధ్వర్యంలో పట్టణంలోని విలియం మూన్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వచ్చారు. పార్టీలకతీతంగా పలు పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు.

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చౌరస్తాకు అన్నివైపులా రాకపోకలు స్తంభించాయి. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిరసన వద్దకు చేరుకొని మద్దతు తెలిపారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరు హైదరాబాద్ రోడ్డును బాగుచేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పేదల ప్రజల ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో గాల్లో కలుస్తున్నాయని మండిపడ్డారు. జోరుగా వర్షం కురుస్తున్న కూడా లేక చేయకుండా నిరసన కొనసాగించారు. తాండూర్ తాసిల్దార్ తారా సింగ్ కు వినతి పత్రం అందజేశారు. రెండు గంటల పాటు నిరసన కొనసాగింది.

Leave a Reply