ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలిలో హై బీపీ (రక్తపోటు), మధుమేహం (షుగర్) వంటి వ్యాధులు సాధారణమైపోతున్నాయి. వీటిని కంట్రోల్లో పెట్టాలంటే… మందులతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవడం కూడా చాలా అవసరం. అయితే, మన పూర్వీకుల ఆహారమైన చిరుధాన్యాలు ఈ రకమైన ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా నిలుస్తున్నాయి.
మిల్లెట్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI) కలిగి ఉంటాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి అనేది నెమ్మదిగా పెరుగుతుంది. మిల్లెట్స్ లో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మిల్లెట్స్ లో మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి.
మిల్లెట్స్ ప్రత్యేకత ఏమిటి?
కొర్రలు, సామలు, వరిగులు, ఉదలు, రాగులు, బజ్రా వంటి మిల్లెట్స్‌లో అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తుంది. మిల్లెట్స్ లోని మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
షుగర్ ఉన్నవారికి మిల్లెట్స్ లాభాలు
మధుమేహం ఉన్నవారికి మిల్లెట్స్ నిజమైన వరం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరుస్తాయి. అధిక ఫైబర్ కారణంగా ఎక్కువసేపు ఆకలి కాకుండా చేసి బరువు నియంత్రణలోనూ సహాయపడతాయి. మిల్లెట్స్ తింటే చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది… అంతేకాదు, ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతూ గుండే ఆరోగ్యాన్ని కాపాడతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటు నియంత్రణలో మిల్లెట్స్ పాత్ర
మిల్లెట్స్ రక్తపోటు నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. చిరుధాన్యాల్లోని పొటాషియం శరీరంలో అదనపు ఉప్పును బయటకు పంపడంలో సహాయపడుతుంది. సహజంగానే తక్కువ సోడియం కలిగినవిగా ఉండటంవల్ల రక్తపోటును స్థిరంగా ఉంచతాయి. అంతేకాక మిల్లెట్స్‌లోని మెగ్నీషియం రక్తనాళాలను సడలించి రక్తప్రసరణను సాఫీగా చేస్తుంది. దాంతో గుండెపై ఒత్తిడి తగ్గుతుంది.
రక్తపోటు నియంత్రణలో మిల్లెట్స్ పాత్ర
మిల్లెట్స్ రక్తపోటు నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. రుధాన్యాల్లో ఉండే పొటాషియం శరీరంలో అదనపు ఉప్పును బయటకు పంపడంలో సహాయపడుతుంది.. సహజంగానే తక్కువ సోడియం కలిగినవిగా ఉండటంవల్ల రక్తపోటును స్థిరంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక, మిల్లెట్స్‌లోని మెగ్నీషియం రక్తనాళాలను సడలించి రక్తప్రసరణను సాఫీగా చేస్తుంది. దాంతో గుండెపై ఒత్తిడి తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు..
మిల్లెట్స్‌ను ఆహారంలో ఎలా చేర్చాలి?
మిల్లెట్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చడం చాలా సులభం. తెల్ల బియ్యానికి బదులుగా కొర్ర లేదా సామల అన్నం తినవచ్చు. ఉదయాన్నే రాగి జావ, కొర్ర దోశ, సామల ఉప్మా లాంటి వంటకాలు ప్రయత్నించండి. మధ్యాహ్నం మిల్లెట్ పులావ్, ఖిచిడీ వంటి వంటకాలు మంచి ఎంపిక. సాయంత్రం మిల్లెట్ లడ్డూలు, ఎనర్జీ బార్లు, పఫ్‌లు తీసుకోవచ్చు. వారంలో కనీసం 3–4 సార్లు మిల్లెట్స్ తీసుకోవడం శరీరానికి స్పష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
రక్తపోటు, షుగర్ ఉన్నవారు దూరంగా ఉండవలసిన ఆహారం
రక్తపోటు, షుగర్ ఉన్నవారు కొన్ని ఆహారాల నుంచి దూరంగా ఉండడం అత్యంత అవసరం. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. అధిక ఉప్పు కలిగిన పదార్థాలు ఉదాహరణకు.. పచ్చళ్లు, చిప్స్, పాపడ్లు, ప్యాకేజ్డ్ స్నాక్స్ వంటివి రక్తపోటును పెంచే ప్రమాదం ఉంది. అందువల్ల వీటిని వీలైనంతవరకు తగ్గించడం మంచిదని డైట్ నిపుణులు చెబుతున్నారు.
అలాగే, కేకులు, స్వీట్లు, బిస్కెట్లు వంటి తీపి ఆహారాలు షుగర్ ఉన్నవారికి హానికరం. తెల్ల బియ్యం, మైదా పదార్థాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచుతాయని హెచ్చరిస్తున్నారు.
సోడాలు, కూల్ డ్రింక్స్ వంటి పానీయాల్లో అధిక చక్కెర, సోడియం ఉండటంతో, అవి రక్తపోటు, చక్కెర నియంత్రణలో అడ్డంకిగా మారుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రెడ్ మీట్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌లో ఉన్న అధిక కొవ్వు గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమని కూడా వారు సూచిస్తున్నారు.
అలాగే, మద్యం, అధిక టీ లేదా కాఫీ కూడా రక్తపోటును పెంచే అవకాశం ఉంది. నిపుణుల సలహా మేరకు, వీటిని పరిమితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం. ఈ విధంగా ఆహార నియంత్రణ పాటిస్తే, రక్తపోటు, షుగర్ స్థాయిలను సమతుల్యం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
జాగ్రత్తలు
మిల్లెట్స్‌తో పాటు కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ కూడా ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యం. థైరాయిడ్ సమస్య ఉన్నవారు మిల్లెట్స్‌ను మితంగా తీసుకోవాలి. షుగర్ లేదా రక్తపోటు మందులు వాడేవారైతే ఆహారంలో ఏవైనా మార్పులు చేసేముందు వైద్యుల సలహా తప్పనిసరి.