కోమ‌టిరెడ్డిపై చ‌ర్చ జ‌ర‌గ‌లేదు!

ఆంధ్ర ప్ర‌భ వెబ్ డెస్కెః మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) పై మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి (Mallu Ravi) తెలిపారు. ఈరోజు హైద‌రాబాద్ గాంధీ భవన్ లో మల్లురవి ఆధ్వ‌ర్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ (PCC Disciplinary Committee) స‌మావేశం నిర్వ‌హించింది.


స‌మావేశంలో నేతల మధ్య విభేదాలు, పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల(Complaints)పై చర్చించారు. అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఫిర్యాదు రాలేదు కాబట్టే కోమటిరెడ్డి(Komatireddy) విషయంలో చర్చ జరగలేదన్నారు. తమకు ఫిర్యాదు రావాలని లేదా పీసీసీ చీఫ్ అయినా చెప్పాలన్నారు. బహిరంగంగా మాట్లాడితే అది ఎదుటివారికంటే ఎక్కువ పార్టీకి నష్టం చేస్తుందని వెల్ల‌డించారు.

నేతల మధ్య విభేదాలపై స్పందిస్తూ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని అందరూ సమన్వయం పాటించాలన్నారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే త‌మ‌కు, పీసీసీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. మాజీ సీఎం కేసీఆర్.. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(Sircilla MLA KTR) ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారన్నారు. గతంలో అవసరం లేకపోయినా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది వారేనని దుయ్యబట్టారు. కేటీఆర్ తాను తవ్వుకున్న గోతోలో తానే పడ్డారని విమర్శించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం ఉంటుందన్నారు. కమిటీ భేటీ సందర్భంగా దళిత నేతతో గొడవ విషయంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి(Narsa Reddy)కి క్రమశిక్షణ కమిటీ నోటీసు (Notices to Narsa Reddy) ఇచ్చింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Leave a Reply